హైదరాబాద్: బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్-3 షో నుంచి పునర్నవి ఎలమినేట్ అయ్యింది. షో మొదటి నుంచి తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చిన ఆమె బిగ్‌బాస్ హౌజ్‌ను వీడుతున్నట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్ లిస్ట్‌లో పునర్నవితో పాటు రాహుల్, వరుణ్, మహేశ్ ఉండగా.. పునర్నవికి తక్కువ ఓట్లు పడడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. మహేశ్ తృటిలో ఎలిమినేషన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు వారం వారం గడుస్తున్న కొద్దీ షో రక్తి కడుతోంది. గట్టి పోటీదారులు ఒక్కొక్కరుగా బయటకు వెళుతుండడంతో చివరి వరకు ఎవరు మిగుల్తారోనని అందరూ చర్చించుకుంటున్నారు.