హైకోర్టును ఆశ్రయించిన గాయత్రీ గుప్తా, శ్వేతారెడ్డి

హైదరాబాద్: ‘బిగ్‌బాస్’ షోపై గాయత్రీ గుప్తా, శ్వేతారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బిగ్‌బాస్ షోపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన గాయత్రి, శ్వేత తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్లో నమోదైన రవికాంత్, రఘు, అభిషేక్, శ్యాంకు ముందస్తు బెయిల్.. మంజూరు చేయొద్దంటూ కోర్టును ఆశ్రయించిన గాయత్రీ, శ్వేతారెడ్డి కోరారు. బిగ్‌బాస్ షోకి వచ్చేందుకు తనను కమిట్మెంట్ అడిగితే కాదన్నానని తాను ఎంపిక కాలేదని పేర్కొన్నారని గాయత్రి షో యాజమాన్యంపై ఫిర్యాదు చేసింది. తనను వంద రోజుల పాటు హౌస్‌లోనే ఉండాలి కాబట్టి వేరే ప్రాజెక్టులేవీ ఒప్పుకోవద్దని చెప్పారన్నారు. తాను ఆరు నెలలుగా సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయానని గాయత్రి తెలిపింది.